Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్‌ వేసిన విజయశాంతి, హిట్‌ మూవీ వైజయంతి రోల్‌లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!

కల్యాణ్ రామ్ కొత్త మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారు. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే ఓ పేరుని టైటిల్ గా అధికారికంగా ఇప్పుడు ప్రకటించారు. ఈ మేరకు క్రేజీ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. 'బింబిసార'తో హిట్ కొట్టిన కల్యాణ్ రామ్.. దీని తర్వాత రెండు ఫ్లాప్స్ చవిచూశాడు.

Kalyan Ram New Movie Title

Hyderabad, March 08: కల్యాణ్ రామ్ కొత్త మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారు. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే ఓ పేరుని టైటిల్ గా అధికారికంగా ఇప్పుడు ప్రకటించారు. ఈ మేరకు క్రేజీ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. 'బింబిసార'తో హిట్ కొట్టిన కల్యాణ్ రామ్.. దీని తర్వాత రెండు ఫ్లాప్స్ చవిచూశాడు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వీళ్లిద్దరూ తల్లికొడుకులుగా నటిస్తున్నారని క్లారిటీ వచ్చింది. ఈ మేరకు 'అర్జున్ సన్నాఫ్ వైజయంతీ' అనే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Kalyan Ram’s film is titled ‘Arjun SO Vyjayanthi’

 

పోలీస్ డ్రస్సులో విజయశాంతి, పక్కనే కల్యాణ్ రామ్ నడుస్తున్నట్లు ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. 'ప్రతి స్త్రీ ఒక కొడుకును పెంచుకుంటుంది. వైజయంతి ఐపీఎస్ ఇక్కడ అర్జున్ అనే సైన్యాన్ని పోషిస్తోంది'' అని పేర్కొన్నారు. .

గతంలోనూ విజయశాంతి.. వైజయంతి పేరుతో ఓ సినిమా చేశారు. అందులో ఆర్మీ ఆఫీసర్ కాగా.. ఇప్పుడు పోలీస్ గా నటిస్తున్నారు. ఇందులో కల్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. త్వరలో రిలీజ్ వివరాలు వెల్లడిస్తారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement